![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రతీ వారం ఎంతో ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. రేపు ప్రసారం కాబోయే ప్రోమోని రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ స్టార్స్ వెర్సెస్ బిగ్ బాస్ స్టార్స్ మధ్య కాంపిటీషన్ పెట్టింది శ్రీముఖి. ఇక సుహాసిని, ప్రేరణ, నాగపంచమి సీరియల్ హీరో పృద్వి శెట్టి వచ్చారు. ఇక శ్రీముఖి ఒక ప్రశ్న వేసింది "ప్రేరణా ఎప్పుడైనా బిగ్ బాస్ కి వెళ్లాలనిపించిందా" అని. "అనిపిస్తుంది..ఛాన్స్ వస్తే వెళ్తా" అంది ప్రేరణ. "బిగ్ బాస్ కి వెళ్తావా వెళ్ళవా" అంటూ సుహాసినిని అడిగింది "వెళ్తానో లేదో తెలీదు, కానీ వెళ్లాలని ఉంది, వెళ్ళకూడదు అని కూడా ఉంది" అని ట్విస్టింగ్ ఆన్సర్ చెప్పింది. "పృద్వి నీకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలని ఉందా" అని అడిగింది శ్రీముఖి. "నాకు బిగ్ బాస్ ని హోస్ట్ చేయాలని ఉంది" అని చెప్పాడు.
ఆ ఆన్సర్ కి అందరూ షాకయ్యారు. "నాగార్జున గారు మీ సీటుకే బొక్కేట్టాడండి" అంటూ శ్రీముఖి లైవ్ లో నాగార్జునకు వినిపించేలా అరిచి మరీ చెప్పింది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్టేజి మీదకు వచ్చారు. "బిగ్ బాస్ హౌస్ ఆ సీరియల్స్ ఆ" అని శోభా శెట్టిని అడిగింది శ్రీముఖి... "సీరియల్సే" అని బిగ్ బాస్ వద్దు అన్నట్టుగా దణ్ణం పెట్టి చెప్పింది. "సీరియల్సా బిగ్ బాసా" అని అంబటి అర్జున్ ని అడిగేసరికి "రెండు కావాలి" అని కైపుగా చెప్పాడు..."ఎప్పుడూ రెండే రెండే అంటే ఎలారా అయ్యేది" అంది శ్రీముఖి నవ్వుతూ. ఇక ఈ షోలో అందరూ వాళ్ళ వాళ్ళ ఫేసెస్ ని బొమ్మలుగా గీసి చూపించారు. ఇక చివరిలో ఒక మ్యాజిక్ షో జరిగింది. రవికృష్ణ ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి శ్రీముఖికి లవ్ ప్రొపోజ్ చేసాడు. ఐతే ఆ బాగ్ లో ఏముందో చూడాలి అంటూ మేజిక్ చేసిన వ్యక్తి అడిగాడు. శ్రీముఖి బాగ్ లో చూసేసరికి అప్పటివరకు రవికృష్ణ చేతికి ఉన్న వాచ్ ఆ బాగ్ లో కనిపించడంతో ఆ మేజిక్ కి అందరూ ఫిదా ఇపోయారు.
![]() |
![]() |